Couple Complained to Collector Against SI: ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేసిన ఎస్సై.. లాకప్ డెత్ చేస్తానంటూ బెదిరింపులు - Couple Complained to Collector Against SI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 12:43 PM IST

Couple Complained to Collector Against SI: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సామాన్యులపై దాడులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. రాజకీయ నేతల అండలతో పోలీసులు సివిల్ కేసుల్లో తల దూర్చి ప్రజలపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. గుండాల్లా ఇళ్లల్లో చొరబడి దాడులు చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కట్టుబట్టలతో ఆ కుటుంబం ఇప్పటికైనా వారికి న్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయానికి రెండోసారి పయనమయ్యారు.. వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో పోలీసులు తమపై దాడికిపాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఎస్సై తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసి లాకప్ డెత్ చేస్తానంటూ బెదిరించారని వెంకటేశ్వరరావు, రాజేశ్వరి దంపతులు రెండోసారి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. బంధువులతో ఆస్తి వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. పోలీసులు ఆకస్మింకంగా ఇంట్లోకి చొరబడి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయనేత అనంతబాబు కను సైగల్లో ముప్పినశెట్టి శ్రీను దాడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారికి ఫిర్యాదు ఇవ్వటంతో.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీసులన్ని ఆదేశించారని తెలిపారు. పూర్వీకుల ఉమ్మడి ఆస్తిని కాజేసేందుకు దాడులు చేస్తున్నారని వాపోయారు..

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.