నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆందోళన - గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నం - Nellore District News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 9:11 PM IST
Concerns of SFI Leaders in Nellore District : విద్యారంగలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరులో ఎస్.ఎఫ్.ఐ. నాయకులు చేపట్టిన కలెక్టరెట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. గేట్లు దూకి కార్యాలంలోకి వెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పెనుగులాటలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. కుంటిసాకులు చూపుతూ చాలా పాఠశాలలను మూసివేయించారని మండిపడ్డారు.
అదేవిధంగా నెల్లూరులో ఒక్క ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ అయినా తెరిపించారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నటువంటి వీఆర్ విద్యాసంస్థని మీ యెుక్క రాజకీయ దురుద్దేశంతో మూసి వేయించారని మండిపడ్డారు. ఆ సంస్థను తిరిగి తెరిపించే వరకు తాము పోరాడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో వందలాది పాఠశాలలు, కాలేజీలు ఎత్తేశారన్నారు. అయిన వీటిపై స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరు కూడా నోరు తెరచి మాట్లాడలేదని విమర్శించారు.
TAGGED:
నెల్లూరు జిల్లా వార్తలు