CM Jagan Review On Chandrababu Arrest: సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష.. చంద్రబాబు కేసుపై ఏఏజీకి సూచనలు - ముఖ్యమంత్రి జగన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 5:29 PM IST
CM Jagan Review On Chandrababu Arrest : లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం (Tadepalli Camp Office)లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి (Yv subbareddY), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబును అరెస్టు (Arrest) చేసింది మొదలు రాజమహేంద్రవరంలోని జైలుకు తరలించే వరకు జరిగిన పరిణామాలపై అధికారులు, పార్టీ ముఖ్య నేతలు సీఎంకు వివరించారు. రాజధాని అమరావతిపై ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల పురోగతిపై చర్చించి కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.