ఇంద్రకీలాద్రిపై ₹216 కోట్ల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన - CM Jagan news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 3:18 PM IST

CM Jagan Foundation Stone Stone for Development Programs on Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.216.05 కోట్లతో బృహత్‌ ప్రణాళిక పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కృష్ణా నదీ తీరంలో 8 ఆలయాలు, మెగా సోలార్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

CM Jagan Visited Vijayawada Durgamma: సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 216.05 కోట్ల రూపాయలతో బృహత్‌ ప్రణాళిక పనులు, కొండ రక్షణ చర్యలతో పాటు నీటి నిర్వహణ, ఇతర పనులకు ప్రారంభోత్సవం చేశారు. వీటితోపాటు కృష్ణా నది తీరంలో 8 ఆలయాలు, ఆంజనేయస్వామి, వినాయకస్వామి ఆలయాలు, అమ్మవారి అన్నప్రసాద భవనం, పోటు నిర్మాణం, కనకదుర్గ నగర్‌ నుంచి మహామండపం వరకు క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. చివరగా మహామండపం దక్షిణాన అదనపు క్యూకాంప్లెక్స్‌, రూ.5 కోట్ల దాత నిధులతో యాగశాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.