CM Jagan and MP Vijayasai Reddy Petitions in Hyderabad CBI Court: లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన సీఎం జగన్.. విచారణ రేపటికి వాయిదా
🎬 Watch Now: Feature Video
CM Jagan and MP Vijayasai Reddy Petitions in Hyderabad CBI Court: విదేశాలకు వెళ్లడానికి తమను అనుమతించాలని అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిలు వేర్వేరు పిటిషన్ల ద్వారా హైదరాబాద్ సీబీఐ కోర్టును అభ్యర్థించారు. సెప్టెంబరు 2 నుంచి 9వ తేదీ (CM Jagan London Tour on September 2nd) మధ్యలో కుమార్తె వద్దకు వెళ్లాలంటూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్సిటీలతో ఒప్పందాల నిమిత్తం యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్, సింగపూర్‌లకు వెళ్లాల్సి ఉందని, వచ్చే ఆరు నెలల్లో 30 రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని విజయసాయి రెడ్డి తన పిటిషన్‌లో కోర్టుకు నివేదించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్, విజయ సాయి రెడ్డిలకు బెయిలు మంజూరు సందర్భంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ షరతు విధించిన విషయం తెలిసిందే. తాజా పిటిషన్‌లపై కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 30వ తేదీ (రేపటి)కి వాయిదా వేసింది.