thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 10:26 PM IST

ETV Bharat / Videos

Central Team will visit AP Panchayat Raj Commissionerate in AP : పంచాయితీరాజ్​లో అక్రమాలపై విచారణ కోసం రానున్న కేంద్రబృందం

Central Team will visit AP Panchayat Raj Commissionerate in AP ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం గూర్చి రాష్ట్ర ప్రభుత్వం పైన తాము చేసిన ఫిర్యాదులపై విచారించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోందని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తెలిపారు.  కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్.. గ్రామ పంచాయతీలకు వెళ్లి సర్పంచ్​లను విచారించి, రికార్డులను పరిశీలిస్తారని వివరించారు. గత నెలలో  సర్పంచ్​ల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్​ల నాయకులు దిల్లీ వెళ్లి చేసిన ఆందోళనలు చేపట్టారు. వారి ఆందోళనల  ఫలితంగానే కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోందన్నారు. కేంద్ర బృందానికి పూర్తి వివరాలను, వాస్తవాలను సర్పంచ్​ల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ లు అందిస్తారని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. 

కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఆయా పంచాయతీల పరిధిలోని స్థానిక సంస్థల నిధుల లెక్కలను విచారణాధికారులు పరిశీలించనున్నారు. గ్రామ సర్పంచ్​లు గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ రాజ్ సంఘాలను కేంద్ర బృందం కలవనుంది. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండంలోని వరగాని గ్రామంలో కేంద్ర బృందం పర్యటిస్తారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, బందరు మండలంలోని పెద యాదర గ్రామాల్లో కేంద్ర పంచాయతీ రాజ్ అధికారులు పర్యటించనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.