Celebrations in Naravaripalle on Chandrababu Bail Grant: చంద్రబాబుకు బెయిల్.. నారావారిపల్లెలో అంబరాన్నంటిన సంబరాలు - Chandrababu Bail Grant news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 10:17 PM IST

Updated : Oct 31, 2023, 10:59 PM IST

Celebrations in Naravaripalle on Chandrababu Bail Grant: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై.. ఆయన (చంద్రబాబు) స్వగ్రామమైన నారావారిపల్లెలో బాణసంచా కాలుస్తూ.. ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. మిఠాయిలు పంచిపెట్టారు.

TDP Workers Fire on YSRCP: స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేయడం, ఆయన జైలు నుంచి విడుదల కావడంపై.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బాణసంచాలు కాల్చుతూ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో.. వివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు, అభిమానులు నారావారిపల్లెకు చేరుకొని.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం జై బాబు-జైజై బాబు అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడు ఏ తప్పు చేయలేదని, ప్రత్యర్థులు ఆయనపై అవినీతి మరక అంటించాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.

Last Updated : Oct 31, 2023, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.