మున్సిపల్ సిబ్బంది అని చెప్పారు - ఇల్లంతా దోచుకుపోయారు
🎬 Watch Now: Feature Video
Cash And Gold Stolen in Nandyala district : మున్సిపల్ సిబ్బంది అని సెప్టిక్ ట్యాంకు పరిశీలించాలని ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లో బంగారం, నగదును అపహరించుకుపోయారు. పట్టపగలే సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నంద్యాలలో జరిగింది. ఇటీవల నంద్యాలలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న ఓ విశ్రాంత ఉద్యోగి రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటికి మున్సిపల్ సిబ్బంది అంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
సెప్టిక్ ట్యాంకు చూడాలని ఇంట్లో ఉన్న వెంకట సుబ్బమ్మ అనే మహిళను అడిగారు. ఎందుకు అని అడుగుతున్నా సెప్టిక్ ట్యాంకు వద్దకు వెళ్లి కనెక్షన్ ఎక్కడి నుంచి ఇచ్చారని అడిగారు. వెంటనే ఆమె భర్త రామసుబ్బారెడ్డి కి ఫోన్ చేసి వారితో మాట్లాడించారు. అంతకంటే ముందు ఆధార్ కార్డు అడగడంతో బీరువాలో ఉన్న కార్డులను తీసి లాక్ వేసి తాళం అలాగే బీరువాకు ఉంచి వారి వద్దకు వచ్చింది. మాట్లాడుతున్న వారిలో ఒకరు లోపలికి వెళ్లి బీరువా తీసి 23 తులాల బంగారం, రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.