Carrying The Dead Dody On Doli : మన్యంలో తప్పని డోలి మోతలు.. డోలీలో మృతదేహం తరలింపు - tribal people problems
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 12:19 PM IST
Carrying The Dead Dody On Doli : అల్లూరి జిల్లా మన్యంలో పుట్టుకైనా, చావైనా.. డోలి మోతలు తప్పడం లేదు. రహదారులు సరిగా లేక గిరిజనులు మృతి చెందితే నేటికీ డోలిమోతతో తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా గురువారం సాయంత్రం రంపచోడవరం మండలం కింటుకూరు గ్రామానికి చెందిన మడి జోగమ్మ (50) అనే గిరిజన మహిళ అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని కింటకూరు సమీపంలో బేస్ క్యాంపు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి కింటుకూరు గ్రామానికి రహదారి లేకపోవడంతో అటవీ మార్గంలో 5 కిలోమీటర్లు కాలినడకన డోలీ కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి తమ గ్రామానికి రహదారి నిర్మించాలని ఉన్నతాధికారులను ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నా ఎటువంటి స్పందన లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రహదారి లేదంటే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని గిరిజనులు వాపోయారు.