కారులో చెలరేగిన మంటలు.. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం - AP Latest News
🎬 Watch Now: Feature Video
వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఉలిమెల్ల రహదారిలో.. కారులో షార్ట్ సర్క్యూట్ కావడంతో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరబల్లి మండలానికి చెందిన మనోహర్ రెడ్డి అనే వ్యక్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మనోహర్ రెడ్డి కారులో ఎయిర్ పట్టేసి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని.. దగ్ధమవుతున్న కారులోని మంటలను అదుపు చేశారు. మంటలు రేగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఎయిర్ పట్టేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది.. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని.. అంతే కాకుండా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.