ACCIDENT LIVE VIDEO: లోయలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి - అనంతపురం జిల్లాలో కారు యాక్సిడెంట్ లైవ్ వీడియో
🎬 Watch Now: Feature Video
CAR ACCIDENT: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి కొండ పైనుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సంఘటనా స్థలంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని దేవరకొండ సమీపంలోని కొండ మీద రాయుడి గుడిలో దైవ దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి కారులో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ ఉమాపతిగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆర్థిక ఇబ్బందులు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొండపై నుంచి కారు పడటం వల్ల వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో బయటపడనుంది.