Capital farmers protest For Chandrababu: చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. అవినీతి ఆరోపణలు అబద్దం: రాజధాని రైతులు - protest against CM Jagan in ap
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 7:10 PM IST
Capital farmers protest For Chandrababu: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ... రాజధాని రైతులు, మహిళలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. విజయవాడలో వైసీపీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. చంద్రబాబు అరెస్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు స్పందించారు. జగన్ ప్రజల చెవిలో పూలు పెట్టారని రైతులు ఎద్దేవా చేశారు.
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో జగన్ తీరుని నిరసిస్తూ.. రైతులు చెవిలో పూలు పెట్టుకొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు (Chandrababu) త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌కు తనకు ఎలాంటి సంబధం లేదని, అరెస్ట్ సమయానికి తాను లండన్‌లో ఉన్నట్లు చెప్పడం విదితమే.