పోలీసులు నుంచి తప్పించుకోబోయి గంజాయి తరలిస్తున్న వాహనం బోల్తా - Ganja Illegal Transport traced by scb ేూోిి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 12:23 PM IST
Cannabis Transport Vehicle Overturned in Alluri: గంజాయి(Cannabis) భారత్లో సహా పలు దేశాల్లో నిషేధించారు. అక్రమ రవాణా(Illegal Transport), వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి తరలింపు మాత్రం ఆగడం లేదు. తాజాగా అల్లూరి జిల్లాలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో కాపు కాసి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అపడానికి ప్రయత్నించారు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి గంజాయి తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
Illegal Transport of Ganja: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారని శృంగవరపుకోట ఎస్సిబి(Special Crime Branch) సీఐ ధర్మారావుకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో బొడ్డవర జంక్షన్ సమీపంలో ధర్మారావు ఆధ్వర్యంలో సిబ్బంది కాపు కాసారు. రాత్రి 8:00 సమయంలో ఓ బొలెరో వాహనం ప్రధాన రోడ్డులో కాకుండా అడ్డదారిలో వస్తుండడం గమనించి పోలీసులు ఆపారు.అయితే డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో ఎస్సీబీ అధికారులు వాహనాన్ని వెంబడించారు. పోలీసులు నుంచి తప్పించుకోవడానికి వేగంగా వాహనాన్ని నడుపాడు. నవోదయ విద్యాలయం ఎదురుగా 516 జాతీయ రహదారిపై చేరుకున్న తరువాత వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
పోలీసులు వాహనాన్ని పరిశీలించి డ్రైవర్ ఒక్కడే ఉన్నట్టు గుర్తించారు. ఎస్సీబీ అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కింద పడ్డ బస్తాలను పరిశీలించారు. మైకా గోన సంచులలో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయి మెుత్తం 400 కిలోల పైబడి ఉండొచ్చని, విలువ సుమారు 40 లక్షలు పైచిలుకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సిఐ ధర్మారావు శనివారం వెల్లడిస్తామన్నారు.