thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2023, 3:03 PM IST

ETV Bharat / Videos

Butchaiah Chowdary Fires on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు.. జగన్ అరాచకానికి పరాకాష్ట : గోరంట్ల

Butchaiah Chowdary Fires on Chandrababu Arrest : చంద్రబాబును అరెస్టు చేసిన తీరు జగన్ అరాచకానికి పరాకాష్ట అని... తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేత పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. నాకు 78ఏళ్లు అని చెప్పిన బుచ్చయ్య చౌదరి.. దాదాపు 54సంవత్సరాలు కమ్యూనిస్టుగా, ఆ తర్వాత, ఎన్టీఆర్ గారితోనూ కలిసి పని చేశాను. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో పరిణామాలు చూశాను... ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో అరాచక పాలన సాగుతోంది. 

ఉత్తర కొరియా అధినేత కిమ్​ (North Korean leader Kim) కూడా ఇలాంటి అరాచకాలకు పాల్పడలేదు. నేను ఎన్నడూ పోలీస్ స్టేషన్​కు వెళ్లిన దాఖలాల్లేవు. అలాంటిది.. రాత్రికి రాత్రి ఇళ్లపైబడి స్టేషన్లకు లాక్కుని పోయారు. ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులకు పాల్పడ్డారు. డ్రైవర్​ను హతమార్చిన ఎమ్మెల్సీకి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి జగన్.. ఎలాంటి నేర చరిత్ర లేని మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయించడం దుర్మార్గం.. అని అన్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై బుచ్చయ్యతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.