ఓవర్టేక్ చేయబోయి బైక్ను ఢీకొట్టిన బస్సు - బైక్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన బస్ డ్రైవర్, ఎదురుగా వస్తున్న బైక్ డీకొట్టాడు. దీంతో బైకు నడిపే వ్యక్తి ఎగిరిపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కాగా ఈ ఘటన గుజరాత్ రాజ్కోట్ మున్సిపల్ కార్పోరేషన్, ఆనంద్ బంగ్లా సమీపంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST