విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయింది : జీవీఎల్‌ - రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 3:23 PM IST

BJP MP GVL Narasimha Rao on Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, ప్రైవేటీకరణపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెట్టుబడులు ఉపసంహరణ చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రక్రియ అసలు జరగలేదని చెప్పారు. 

బ్లాస్ట్ ఫర్నేస్ -3 విషయంలో జరిగిన ఒప్పందం కేవలం స్థానిక ఒప్పందం మాత్రమేనని, ఇందులో కేంద్రం జోక్యం లేదని స్పష్టం చేశారు. ప్లాంట్ నడిస్తే గాని లాభాల బాట పట్టదని, ముడి సరకు విషయంలో స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు పడుతోందని చెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో తానే స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడనన్నారు. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ నడిచేది, నడిపించింది అంతా ఆర్ఐఎన్ఎల్ (Rashtriya Ispat Nigam Ltd) అని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.