BJP Leader Vishnu Kumar Raju on Punganur Incident "పుంగనూరు ఘటన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది.. ఒక్క సీటు రాకుండా బుద్ది చెప్పాలి" - BJP Leader Vishnu Kumar Raju
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-10-2023/640-480-19839002-thumbnail-16x9-bjp-leader-vishnu-kumar-raju-punganur-incident.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 5:01 PM IST
BJP Leader Vishnu Kumar Raju on Punganur Incident: పుంగనూరు ఘటన ఉత్తరాంధ్ర వాసుల అత్మగౌరవానికి సంబంధించినదని, ప్రశాంతంగా సైకిల్ యాత్ర చేసుకుంటున్నవారిపై మంత్రి అనుచరుడు దాష్టీకానికి పాల్పడం దారుణం అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక్కసీటు కూడా రాకుండా వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉత్తరాంధ్రవాసులందరిపైనా ఉందన్నారు. రుషికొండకు వస్తామని సీఎం జగన్ చెబుతూ ఉత్తరాంధ్ర వాసులను పూర్తిగా అణగదొక్కడానికేనని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2024లో ఓటు ద్వారా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ పుంగనూరు రాసిచ్చేశారా అని నిలదీశారు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిపై రౌడీ షీట్లు ఎత్తేశారో వివరాలు విడుదల చేయాలి డిమాండ్ చేశారు. 86 కంపెనీలకు 21 కోట్ల రూపాయిల ఐటీ ఇన్సెంటివ్లు బకాయిలు ఇవ్వాలని అన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చిన సీఎంని ఎవరూ కలవకుండా చేసింది వీటిపై ఐటీ కంపెనీల యజమానులు ప్రశ్నిస్తారు అనే అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టడంలో వైసీపీకి బీజేపీ మద్దతు ఉందన్న మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.