Adinarayana Reddy On Avinash సీబీఐ విచారణకు హాజరవకుండా... అవినాశ్‌రెడ్డి నాటకాలు: ఆదినారాయణరెడ్డి - వివేకా హత్య కేసు
🎬 Watch Now: Feature Video
Adinarayana Reddy On Avinash: వివేకా హత్య కేసులో విచారణకు హాజరవకుండా... అవినాశ్‌రెడ్డి నాటకాలు ఆడుతున్నారని.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. బెయిల్ పిటిషన్‌ను అన్ని న్యాయస్థానాలు కొట్టివేసినా... ఇంకా ప్రయత్నాలు ఆపడం లేదని విమర్శించారు. వివేకా హత్య విషయం జగన్‌కు ముందే తెలుసని... కావాలనే ఆ తెల్లవారుజామున రాజకీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌ను బీజేపీ వెనకేసుకొస్తుందన్న వార్తలు అవాస్తవమన్న ఆదినారాయణరెడ్డి... వివేకా హత్య కేసులో దోషులకు త్వరగా శిక్షపడేలా చూడాలని సీబీఐని కోరారు.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ పదే పదే హాజరుకావాలంటే.. ఆయనే 4రోజులు వ్యవధి కావాలని కోరుకున్నాడు. దానికి వాళ్లు స్పందించి 3రోజులు అవకాశం ఇస్తే ఈయన మళ్లీ దొంగాట ఆడుతున్నాడు. అసలు అమ్మకు బాగలేదనేది సాకు, ఇది పచ్చి అబద్ధం. అలాగే సీజేఐ ఒకే మాట చెప్పారు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పింది. అదే విధంగా తెలంగాణ హైకోర్ట్ కూడ తిరస్కరించడం జరిగింది. వివేకా హత్య పూర్తి స్థాయిలో జగన్, భారతి, అవినాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిసే జరిగింది. వివేకా ఆత్మ శాంతించాలంటే సీబీఐ వాళ్లు నిందితులను శిక్షించాలని బీజేపీ తరఫున కోరుతున్నాను. -ఆదినారాయణరెడ్డి, బీజేపీ నేత