ఒకేసారి 11,304 మంది బిహు డ్యాన్స్.. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా.. - బిహు డాన్స్ వీడియో
🎬 Watch Now: Feature Video
bihu world record assam: అసోం రాజధాని గువాహటిలో భారీ నృత్య ప్రదర్శన జరిగింది. ఒకేసారి 11,304 మంది జానపద నృత్యకారులు.. సంప్రదాయ బిహు డాన్స్ చేశారు. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా.. నృత్యకారులు ఈ నాట్యం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమక్షంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. గురువారం సరుసజై స్టేడియంలో వైభవంగా ఈ నృత్య వేడుక సాగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం అసోం ప్రభుత్వం అప్లై చేసింది.
ఈ కార్యక్రమంలో గాయకులు తమ పాటలతో అలరించారు. ధోల్, తాల్, గోగోనా, టోకా, పెపా, జుతులి వంటి ఇతర వాయిద్యాలను కళాకారులు వాయించారు. ఈ మెగా ఈవెంట్‌కు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టీస్ సెషన్లు నడిచాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కళాకారులు, నిర్వహకులు తీవ్రంగా శ్రమించారు. అసోం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిపే లక్ష్యంతో ఈ వేడుక జరిగింది. కార్యక్రమానికి ముందు మాట్లాడిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. ఒకే వేదికపై భారీ బిహు డాన్స్ పదర్శన చేసి.. జానపద నృత్యం విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జానపద నృత్యం..
కొద్ది రోజుల క్రితం మౌనీయ మహోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. జానపద కళాకారులతో దివారీ నృత్యం చేశారు. ఛౌతర్పుర్లో జరిగిన ఈ కార్యక్రమం.. ముఖ్యమంత్రి వేదికపై కళాకారులు ఉత్సాహంగా డాన్స్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.