Bezawada Bar Association Rally Against NIA Raids: న్యాయవాదులపై ఎన్ఐఏ దాడులను ఖండించిన బెజవాడ బార్ అసోసియేషన్ - Bezawada Bar Association
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 10:45 AM IST
Bezawada Bar Association Rally Against NIA Raids: చట్టాన్ని రక్షించే న్యాయవాదులపై ఎన్ఐఏ (National Investigation Agency) కేసులు పెట్టటాన్ని బెజవాడ బార్ అసోసియేషన్ (Bezawada Bar Association) ఖండించింది. ఎన్ఐఏ చర్యలకు నిరసనగా విజయవాడలో ర్యాలీని చేపట్టారు. బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బాధితుల తరపున ఎన్ఐఏ కేసుల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులపై కేసులు పెట్టి.. వేధించటం సరికాదని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. న్యాయవాదుల ఇళ్లలో తనిఖీలు చేసి..సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవటం ఎన్ఐఏ అరాచకానికి నిదర్శనమన్నారు. న్యాయవాదులను నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ పరిసర ప్రాంతాలకి సైతం ఎవరినీ రానివ్వలేదని అన్నారు. ఎన్ఐఏ కొంత మంది చేతిలో కీలుబొమ్మగా మారి.. న్యాయవాది వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. అసలు న్యాయవాదులను ఏ కేసులో ముద్దాయిలుగా చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని హైకోర్టు సీజే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు.