Belt Shop Open Auction in Dachepalli: వైసీపీ నాయకుల ధన దాహం.. బహిరంగంగానే బెల్టుషాపు వేలం - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 5:41 PM IST

Belt Shop Open Auction in Dachepalli : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని భత్రుపాలెం గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణకు వైసీపీ నేతలు బహిరంగా వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో అదే గ్రామానికి చెందిన వ్యకి రూ.3 లక్షల 93 వేల ధరకు పాట పాడి బెల్ట్ షాపును కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.

దశలవారీగా మద్యపానం నిషేధిస్తామని జగన్​ ప్రకటించినా.. వైసీపీ నాయకులే ఇలా బహిరంగా బెల్ట్​షాపు నిర్వహణకు వేలం పాటను పెట్టడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్థులు నాయకులను నిలదీశారు. దీంతో గ్రామస్థులు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది మామూళ్ల మత్తులో పడి.. అధికారులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. వైసీపీ నాయకులు బెల్ట్ షాపు విర్వహణకు వేలం పాట పాడుకున్న సొమ్మును భత్రుపాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి ఖర్చు పెట్టే విధంగా గ్రామస్థులు, నాయకుల మధ్య ఒప్పందం చేసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.