Bears Viral Video: మహిళను పరుగులు పెట్టించిన ఎలుగుబంట్లు.. వైరల్ అవుతున్న వీడియో - bears wandering in sri sathya sai district
🎬 Watch Now: Feature Video
Bears in Sri Sathya Sai District: ఇళ్లలో అంతా ఎవరి పనులు వారు చేసుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా వారందరినీ భయంతో పరుగులు పెట్టేలా ఓ రెండు ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం గౌడనకుంటలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. గ్రామంలో పనుల్లో నిమగ్నమైన ప్రజల నివాసాల మధ్య రెండు ఎలుగుబంట్లు ప్రవేశించి పరుగులు తీస్తూ గ్రామంలో అలజడి సృష్టించాయి. కుక్కలు వాటిని వెంబడించడంతో ఎలుగుబంట్లు గ్రామంలోని వీధి వీధినా పరుగులు తీసాయి. ఇళ్ల మధ్యలో పరుగెడుతూ గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేశాయి. ఇళ్ల మధ్యలో ఎలుగుబంట్లు పరుగెడుతోన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ఆవరణలో వంట చేస్తున్న ఓ మహిళ ఎలుగుబంట్ల రాకను గమనించి ఇంట్లోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. అప్రమత్తమైన గ్రామస్థులు కేకలు వేస్తూ ఎలుగుబంట్లను వెంబడించటంతో అవి కొండ ప్రాంతానికి వెళ్లిపోయాయి. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలుగుబంట్లు మళ్లీ తమ గ్రామంలోకి రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.