పారిస్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు - ప్రాన్స్
🎬 Watch Now: Feature Video
Bathukamma and Dussehra Celebrations: ప్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రాన్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు.. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. అందరూ కలసి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు. అనంతరం తెలుగింటి ఆడపడుచులు, ఫ్రెంచ్ దేశస్థులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ పాటలు, నృత్యాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎం. రఘునందన రావు, డానియల్ నే జెర్స్, మునిస్వామి రాజారాం, శ్రీమతి స్టెల్లా, కన్నబిరాన్, పాల్గొన్నారు . వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సూరజ్, నమ్రత, విజయ్ పల్ల, స్వాతి, ప్రద్యుమ్న తమ గానమృతాలతో ప్రేక్షకులను అలరించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST