కంప్యూటర్ ఇంక్రిమెంట్‌ను వెంటనే చెల్లించాలి : ఏపీజీబీ రిటైరీస్ వెల్ఫేర్ సొసైటీ నేతలు - ఏపీజీబీ రిటైరీస్ వెల్ఫేర్ సొసైటీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-11-2023/640-480-20140061-thumbnail-16x9-bank-retired-employees-protest.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 3:59 PM IST
Bank Retired Employees Are Protest : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు యాజమాన్యం ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ.. నెల్లూరు విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. '2018 ఏప్రిల్ 1న కి ముందు రిటైర్డ్ అయిన వారికి కూడా కంప్యూటర్ ఇంక్రిమెంట్ ని వెంటనే అమలు చేయాలి' అని ప్లకార్డులతో బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కంప్యూటర్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం దారుణమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రిటైరీస్ వెల్ఫేర్ సొసైటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాజమాన్యం తన వైఖరిని మార్చుకొని.. తమ డిమాండ్లను తొందరగా పరిష్కరించి న్యాయం చేయాలని ఏపీజీబీ రిటైరీస్ వెల్ఫేర్ సొసైటీ నేతలు కోరారు. 1993 సంవత్సరం నుంచి కంప్యూటర్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నట్లు ఏపీజీబీ రిటైరీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రామ్ తెలియజేశారు. తమ డిమాండ్లను డిసెంబరు 4 లోపు చెల్లించకపోతే.. కడపలోని బ్యాంకు హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.