Asha Worker Died in Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆశా వర్కర్ మృతి.. పని ఒత్తిడే కారణమంటూ ఆందోళన - asha worker died in guntur district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/640-480-19698884-thumbnail-16x9-asha-worker-died-in-jagananna-arogya-suraksha.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 6:07 PM IST
Asha Worker Died in Jagananna Arogya Suraksha: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాష్ నగర్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విషాదం నెలకొంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో (Jagananna Arogya Suraksha Program) పాల్గొనేందుకు వచ్చిన ఆశా వర్కర్ (Accredited Social Health Activist) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికి కృపమ్మ మృతి చెందారు. పని ఒత్తిడి వల్లే ఆమె మృతి చెందారని కుటుంబసభ్యులు, ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమపై పని భారం తగ్గించాలని, సెలవులు ఇవ్వాలని నినాదాలు చేశారు.
కాగా కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు గత పది రోజులుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశా కార్యకర్తలతో పగలు, రాత్రీ తేడా లేకుండా పని చేయిస్తున్నారని.. తోటి కార్యకర్తలు తెలిపారు. ఈ రోజు ఉదయం 7 గంటలకల్లా అందరూ విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడంతో అల్పాహారం తీసుకోకుండానే విధులకు హాజరయ్యామని చెప్పారు. విధులకు వచ్చిన కృపమ్మ 11 గంటల సమయంలో కళ్లు తిరిగి కిందపడిపోయారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు.