సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశం - వైసీపీ నేతల మధ్య భగ్గుమన్న వర్గపోరు - kurnool ysrcp leaders latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 1:26 PM IST
Argument Between YSRCP Leaders: కర్నూలులో వైసీపీ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య మరోసారి వర్గపోరు బయటపడింది. డిసెంబర్ 17న వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు కర్నూలు జిల్లా ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో వైసీపీ రీజనల్ ఇన్ఛార్జి మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మేయర్ బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు.
YSRCP Leaders Meeting in Kurnool: ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయుడు మల్లికార్జున మాట్లాడుతూ వైసీపీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగలేదని సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ వర్గీయులు మల్లికార్జునపై ఆగ్రహించారు. ఇరు వర్గీయులు తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగడంతో వీరిని వేదిక నుంచి దింపేశారు. దీంతో గొడవ సద్దు మణిగింది.