Appsc Group1 5th Ranker Interview: గురిపెట్టి గ్రూప్-1 కొట్టేశాడు..! 5వ ర్యాంక్ విజేత భానుప్రకాశ్‌రెడ్డి విజయరహస్యమిదే.. - APPSC Results
🎬 Watch Now: Feature Video
Appsc Group1 5th Ranker Interview: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే గ్రూప్-1 తుది ఫలితాలు రానేవచ్చాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 సాధించడమే లక్ష్యంగా ఏళ్లు తరబడి ప్రిపేరై.. అహోరాత్రులు శ్రమించిన ఎంతోమంది కల.. ఫలితాల రాకతో నెరవేరినట్లైంది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు కొందరైతే.. మొదటగా గ్రూప్-1కు ఎంపికైన వారు మరికొందరు. ఇలా గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన ఒక్కొక్కరిది ఒక్కో గాథ. పోటీ పరీక్షలంటే లక్షలమందిలో వందల్లో మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అంతటి పోటీ ప్రపంచంలో అంబేడ్కర్ కోససీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామానికి చెందిన భానుప్రకాశ్ రెడ్డి(23) టాప్ 5 స్థానంలో నిలిచారు. దీంతోపాటు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇంత చిన్నవయసులో అంతటి ఘన విజయాన్ని పొందటానికి తన ప్రిపరేషన్ ఎలా కొనసాగించారు..? భవిష్యత్తు తరాల వారికి ఎలాంటి సూచనలను ఇస్తారనే విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి..