APCPS Employees Association Fire on GPS Bill: 'జీపీఎస్ బిల్లుపై చర్చించకుండా ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్నారు' - APCPS leader Mariadas comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 8:06 PM IST
APCPS Employees Association Fire on GPS Bill: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన జీపీఎస్ బిల్లుపై.. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియదాస్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం..బిల్లుపై ఉద్యోగులతో చర్చించకుండా బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఓపీఎస్ ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని జీపీఎస్ విధానాన్ని తీసుకురావడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
APCPS Leader Mariadas Comments: జీపీఎస్ బిల్లుపై.. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియదాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'' రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి, ఉద్యోగ విరమణ తరువాత కనీసం ఉద్యోగి దాచుకున్న డబ్బును కూడా ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపే బిల్లే ఈ జీపీఎస్. ఇలాంటి బిల్లును ప్రభుత్వం తీసుకురావడం అన్యాయం. ఈ బిల్లు ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఉద్యోగికి ఏ విధంగానూ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ బిల్లును ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడాన్ని బట్టి చూస్తేనే స్పష్టంగా అర్థమౌతుంది. ఇది అప్రజస్వామికం. జీపీఎస్‌ని 3.5 లక్షల సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.'' అని ఆయన అన్నారు.