APCC Media Committee Chairman Tulsi Reddy Fire on CM Jagan: 'కరవు నివారణ ప్రణాళికలేవీ..? పంటలు ఎండుతున్నా పట్టించుకోని జగన్' - తులసి రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 3:54 PM IST
APCC Media Committee Chairman Tulsi Reddy Fire on CM Jagan : రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో కరవు నివారణకు జగన్ ప్రభుత్వం చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రoలో 679 మండలాలకు గానూ 303 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని తులసి రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో 40 శాతం భూమి సాగుకు నోచుకోలేదని, సాగుచేసిన 60 శాతం భూముల్లో నీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
AP Congress Party Working President Tulasi Reddy Comments On YCP Government : ఉపాధి పనులు లేక ప్రజలు వలస పోతున్నారని తులసిరెడ్డి తెలిపారు. వెంటనే ఉపాధి పనులు ప్రారంభించి వలసలు నివారించాలని, ఈ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు సమగ్ర పంటల భీమా అమలు చేయాలని అన్నారు. పశుగ్రాసం సరఫరా, వ్యవసాయ రుణాల మాఫీ, కొత్త వ్యవసాయ రుణాలు రైతులకు అందించాలన్నారు. కర్ణాటక ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ కరవు మండలాలను ప్రకటించలేదని తులసిరెడ్డి దుయ్యబట్టారు.