AP Train Accident Viral Video: విజయనగరం రైలు ప్రమాద దృశ్యాలు.. చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు.. - విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Published : Oct 30, 2023, 12:46 PM IST
AP Train Accident Viral Video: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలు ప్రమాదం ఆదివారం రాత్రి 7గంటల సమయంలో సంభవించగా.. సహాయక చర్యలు, రైల్వే లైన్ పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాద స్థలంలో రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి తీరును చూస్తే.. ప్రమాదం ఏ స్థాయిలో సంభవించిందో అర్థం అవుతోంది. ఒక బోగీపై మరో బోగీ దూసుకెళ్లిపడిఉండడాని చూస్తే.. రైలు ప్రమాద స్థాయి ఏ తీరుగా ఉందో ఊహించవచ్చు. అగ్గిపెట్టెల మాదిరి పడి ఉన్న రైలు బోగీలు.. శరవేగంగా క్షతగాత్రలను తరలించడానికి సిబ్బంది చేస్తున్న సహాయక చర్యలు.. రైలు లైను పునరుద్దరణ అన్ని జరుగుతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఈ ఘటన రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో ఎక్కడ ఏం జరిగిందో తెలియరాలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 100 మంది వరకు గాయాలపాలైనట్లు సమాచారం.