Lokesh solved water problem: టిడ్కో ఇళ్ల సముదాయంలో నీటి సమస్య.. తీర్చిన యువనేత లోకేశ్ - cm jagan comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2023, 1:54 PM IST

TDP leader Nara Lokesh solved the water problems of Tidco householders: 'రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి.. చరిత్ర మార్చేలా చేశాం. కట్టేది ఇళ్లు కాదు..ఊళ్లు' అంటూ పలు బహిరంగ సభల్లో ప్రసంగించే సీఎం జగన్.. ఆ టిడ్కో ఇళ్లలో నివాసముండే ప్రజల సమస్యలను తీర్చలేకపోతున్నారంటూ లబ్దిదారులు ఆగ్రహిస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారంటూ మండిపడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో గృహాల వాసులు దాహంతో అల్లాడిపోతున్నారు. పక్షం రోజులుగా నీరురాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా.. అవి ఏమాత్రం సరిపోవడం లేదు. స్నానానికి నీళ్లు లేక విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడం లేదు. ట్యాంకర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చున్నా.. బిందెడు నీరు దొరకడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మూడు, నాల్గవ అంతస్తుల్లో ఉండే వారు నీటిని పైకి తీసుకెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో టిడ్కో నివాసుల నీటి సమస్యను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి.. ఉచిత మంచినీటి ట్యాంకర్లను పంపించి.. టిడ్కో వాసుల నీటి సమస్యను తీర్చారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.