జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలను ఖండించిన సీపీఎస్ అసోసియోషన్ - Jayaprakash Narayan on the Old Pension Scheme
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:54 AM IST
AP Secretariat CPS Association Condemned Jayaprakash Narayan Comments : పాత పెన్షన్ విధానం దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలకు ప్రమాదం అంటూ లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ (Jayaprakash Narayan) వ్యాఖ్యల్ని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ (AP Secretariat CPS Association) ఖండించింది. ఉద్యోగుల పెన్షన్ల గురించి మాట్లాడిన జేపీ 25 లక్షల కోట్ల కార్పోరేట్ల బ్యాంకు బకాయిల ఎగవేత గురించీ మాట్లాడాలని డిమాండ్ చేసింది. ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బడా కార్పోరేట్ల బ్యాంకు బకాయిలను మాఫీ చేయటం ఆర్ధికవ్యవస్థకు ప్రమాదకరం కాదా అంటూ ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ప్రశ్నించింది. సీపీఎస్‌లో సామాజిక బాధ్యతగా ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ వస్తోందని వ్యాఖ్యానించింది.
Jayaprakash Narayan Comments on OPS : రాజకీయాల్లో ఐదేళ్లు ఉన్న వారికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం 33 ఏళ్ల సర్వీసు చేసే ఉద్యోగుల గురించి వెనక్కు తగ్గటంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. జీపీఎస్ ప్రత్యామ్నాయమని చెప్పిన జేపీ.. 20 నెలలుగా ఏపీ ప్రభుత్వం సీపీఎస్ కాంట్రిబ్యూషన్ ను చెల్లించని అంశంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది. కేంద్రం సీపీఎస్ కాంట్రిబ్యూషన్ 14 శాతానికి పెంచినా ఏపీ తన వాటాను పెంచలేదన్న వాస్తవం జేపీకీ తెలుసా అని పేర్కోంది.