టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు అభ్యంతరం - నగదు విడుదల చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు - AP High Court

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 3:16 PM IST

AP High Court on TTD Funds Diversion: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోడ్లు, పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులు వినియోగించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. తిరుపతిలో పారిశుద్ధ్యం, రోడ్ల పనులకు టీటీడీ నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మళ్లింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు నగదు విడుదల చేయొద్దని టీటీడీకి ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియ మాత్రం కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. 

Bhanuprakash Reddy Pill in HC on TTD Funds Diversion: టీటీడీ నిధులు మళ్లింపును సవాల్ చేస్తూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్‌ చేస్తున్న పనులకు టీటీడీ నిధులను మళ్లించడం దేవాదాయ చట్టానికి విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటివరకు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయలు మళ్లించినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులను మళ్లించలేదని హైకోర్టుకు నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీని, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.