Advocate SRP on Chandrababu CID Custody చంద్రబాబు అరెస్ట్‌పై సుప్రీంకోర్టే తేల్చాలి: న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ - chandrababu arrest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 8:26 PM IST
AP High Court Advocate SRP on Chandrababu CID Custody: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి రెండు రోజులపాటు చంద్రబాబు నాయుడిని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులోనే ఆయనను (చంద్రబాబు) విచారించాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబును విచారణ చేయాలని సూచించింది. విచారణ చేపట్టే అధికారుల పేర్లను కోర్టుకు ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై.. రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
Advocate Sunkara Rajendraprasad Comments: చంద్రబాబును కస్టడీకి అప్పగించడం అనేది న్యాయ ప్రక్రియలో సాధారణ అంశమేనని.. న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. పోలీసుల విచారణలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవన్నారు. ఇలాంటి పిటిషన్లను న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుని.. పోలీసుల విచారణకు సహకరిస్తుంటాయని వెల్లడించారు. అయితే, చంద్రబాబును అరెస్టు చేసిన కేసులో.. 17A నిబంధన వర్తిస్తుందో..?, లేదో..? దేశ అత్యున్నత న్యాయస్థానమే (సుప్రీంకోర్టు) తేల్చాలని సుంకర రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ఈ కేసుల నుంచి బయటికి రావాలంటే..ఏయే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. మరి, ఆ విషయాలు ఏమిటో.. ఈ వీడియోను చూసి మీరు కూడా తెలుసుకోండి.