పేదలందరికి ఇళ్ల వడ్డీ రాయితీ నిధుల విడుదల

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 7:38 PM IST

 AP CM Jagan to release Rs 46 cr for beneficiaries of housing loan scheme: “నవరత్నాలు పేదలందరికి ఇళ్లు" పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వడ్డీ రాయితీ నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. గృహనిర్మాణం చేస్తున్న వారికి పావలా వడ్డికి 35వేలు చొప్పున బ్యాంకు రుణం అందించగా, సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీని విడుదలచేశారు. అర్హులైన 4 లక్షల7 వేల323 లబ్ధిదారులకు వడ్డీ రాయితీ కింద 46.90 కోట్లను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను జమ చేశారు. 

12.77 లక్షల మందికి 35వేల చొప్పున 4,500 కోట్ల బ్యాంకు రుణం అందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.  దేశ,రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు.  రాష్ట్రంలో 22.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గృహనిర్మాణం చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 2 లక్షల 70 వేలు ఖర్చవుతోందని, మౌలిక వసతుల కోసం 1 లక్ష అదనంగా ఖర్చవుతోందన్నారు. మొత్తంగా ఒక్కో ఇంటికి 3 లక్షల 70 వేలు ఖర్చు అవుతోందని సీఎం తెలిపారు. 5-20 లక్షల వరకు ఆస్తిని ఒక్కో మహిళ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.