Another Leopard in Tirumala : తిరుమలలో మరో చిరుత.. మళ్లీ అక్కడే.. ట్రాప్ కెమెరాల్లో కదలికలు - Leopard attack
🎬 Watch Now: Feature Video
Published : Sep 1, 2023, 1:25 PM IST
Another Leopard in Tirumala : తిరుమలలో చిరుతల సంచారం ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. కాలినడక మార్గంలో తాజాగా మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అలిపిరి కాలిబాటలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద చిరుత (Cheeta) తిరుగాడుతున్న దృశ్యాలు అటవీ శాఖ సిబ్బంది అమర్చిన ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల ఓ బాలిక చిరుత దాడికి గురైన ప్రాతంలోనే అది సంచరించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమలలో అటవీ జంతువుల సంచారం.. కాలినడక భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. శ్రీవారి మెట్ల మార్గం ( Srivari Stairway ) లో కోతులు సర్వసాధారణం కాగా.. ఎలుగు బంట్లు, చిరుతలు కూడా యథేచ్ఛగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదవుతున్నాయి. అటవీ ప్రాంతంలో మనుషుల అలజడి పెరిగిన నేపథ్యంలో చిరుతలు బయటకు వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కాలిబాట పరిసరాల్లో కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్ జంతువుల సంతానోత్పత్తి సమయం కావడంతో అలజడి సర్వసాధారణమని అటవీ అధికారులు చెప్తున్నారు. భక్తుల రక్షణ దృష్ట్యా చిరుతలను బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు.