Anganwadi Milk in Sri Satyasai Disrict : 'జగనన్న సంపూర్ణ పోషణ' పాల ప్యాకెట్ తీసుకున్నారా..? అయితే ఒకసారి చెక్ చేసుకోండి.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2023, 11:43 AM IST
Anganwadi Milk in Sri Satyasai Disrict : జగనన్న సంపూర్ణ పోషణ కింద గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పాలపాకెట్లలో పురుగులు వచ్చాయి. పేదలకు ఇచ్చే సరుకులపై ముఖ్యమంత్రి జగన్ ఫొటో ముద్రించే విషయంలో ఉన్న శ్రద్ధ నాణ్యతపై లేదని ప్రజలు వాపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేసే పదార్ధాలలో ఒకచోట పాములు వస్తే మరోచోట ఈగలు వస్తున్నాయి. ఇప్పుడేమో శ్రీ సత్య సాయి జిల్లాలో ఏకంగా పాల ప్యాకెట్లలో తెల్లటి పురుగులు వచ్చాయి.
Worms in Sampurna Poshana Milk : సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులమతిసడ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి రెండు రోజుల క్రితం పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆమె ఆ పాలను వేడి చేసేందుకు గిన్నెలో పోస్తుండగా తెల్లటి పురుగులు కనిపించాయి. అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులకు వాటిని చూపించింది. మిగిలిన ప్యాకెట్లను గిన్నెలో పోసి చూడగా వాటిలోనూ పురుగులు రావడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం గ్రామమంతా తెలిసి సంపూర్ణ పథకం పొందుతున్న అందరు ప్యాకెట్లు విప్పి చూడగా తెల్లటి పురుగులు కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు ఇలాంటి పాలను సరఫరా చేస్తున్నారా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.