Anam Ramanarayana Reddy on Liquor Scam: మద్యం కుంభకోణంపై విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి : ఆనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 5:53 PM IST

thumbnail

Anam Ramanarayana Reddy on liquor scam: ఏపీ మద్యం కుంభకోణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధిపై నిర్వహించిన చర్చాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆనం వైసీపీపై విమర్శలు గుప్పించారు.  లిక్కర్ అమ్మకాలలో అవక తవకలపై కేంద్ర పెద్దలు స్పందించేలా పురందేశ్వరి ఒత్తిడి తీసుకు రావాలని ఆనం డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా మద్యం వ్యాపారంలో అక్రమాలపై పురందేశ్వరి బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న ఆనం.. కేంద్ర పెద్దలు ఎందుకు స్పందించడం లేదో చెప్పలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలలో జీఎస్టీ వర్తించకుండా అవక తవకలకు పాల్పడుతున్నారని తెలిపారు. మద్యం అమ్మకాలలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలతో విచారణ చేపట్టాలని ఆనం డిమాండ్ చేశారు.

సోమశిల ప్రాజెక్టుకు ముప్పు.. సాగునీటి ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం నిధులను కేటాయించడం లేదని  ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. సోమశిల ప్రాజెక్ట్‌ పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు సామగ్రి మొత్తం తీసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి వరదలు వస్తే... జిల్లా ప్రజలను దేవుడు కూడా కాపాడలేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.