Ammavaru Decoration with Currency in Amalapuram: అమలాపురంలో రూ.2.50 కోట్ల కరెన్సీతో.. అదిరిపోయేలా అమ్మవారి అలంకరణ - Dussehra Celebrations 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 3:36 PM IST

Ammavaru Decoration with Currency in Amalapuram of Konaseema District : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలో దుర్గాదేవి పూజలు అంబరాన్నంటాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొమ్మిది రోజుల వేడుకల్లో అమ్మవారు వివిధ రూపాలలో పూజలందుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వైశ్య సంఘం ఉత్సవ కమిటీ రెండు కోట్ల 50లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీదేవి అమ్మవారిని శ్రీసరస్వతి దేవి అలంకరణ చేశారు. 

Dussehra Celebrations 2023 : శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబ దేవి అమ్మవారు స్కందమాత అలంకారంలో అభయమిచ్చారు. కోలాటాలు, డమరుక నాదాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు శేష వాహనసేవ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో ఉన్న శ్రీఎల్లారమ్మ అమ్మవారికి మూలా నక్షత్రం కావడంతో విద్యార్థులు సరస్వతీ పూజ చేశారు. రాష్ట్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోలాహలంతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.