"అభివృద్ధి లేదు, పంచలేదు - ప్రభుత్వం చేసిన కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయి" - CPI Ramakrishna on Debts
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-12-2023/640-480-20345793-thumbnail-16x9-all-parties-meeting-on-ap-debts.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 3:22 PM IST
All Parties Meeting on AP Debts: కార్పొరేషన్ ముసుగులో వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను దోచేసిందని విజయవాడలో అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో నిలిపి అభివృద్ధిలో మాత్రం పాతాళానికి నెట్టిందని విమర్శించారు. 3 లక్షల 40వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఆ నగదంతా ఏమయ్యిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
'ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా' అనే అంశంపై అఖిలపక్ష నేతలు చర్చించారు. అప్పులు తెచ్చేందుకు రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఐఏఎస్ అధికారులు సహకరించారని మండిపడ్డారు. తీసుకవచ్చిన రుణాలను అభివృద్ధికి ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం, కనీసం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులైనా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకువచ్చిన అప్పుల వినియోగంపై కౌన్సిల్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేషన్ల ద్వారా 3లక్షల కోట్లకు అప్పులు తీసుకువచ్చారని కాగ్ తెలిపినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ అప్పులను బడ్జెట్లో చూపడం లేదన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి లేదని, పంచలేదని, ఆ నగదంతా ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం, నిర్వహణ కోసం నిధులు ఇవ్వకపోవడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.