విద్యార్థుల ప్రతిభను మెరుగుపర్చుకునేందుకు వర్సిటీలు ఉపకరిస్తాయి: అక్కినేని నాగార్జున - Nagarjuna who started Amphitheater in AU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 10:17 PM IST
Akkineni Nagarjuna at Andhra University : విద్యార్ధులు సమాజానికి ఉపయోగపడే శక్తులుగా రాణించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. విశాఖ ఆంధ్ర వర్సిటీలో నవీకరించిన రంగస్ధల వేదికను, యాంఫీ ధియేటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు అఖిల్, సోదరి నాగసుశీల పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునేందుకు వర్సిటీలు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. ఆంధ్ర వర్సిటీతో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అలాగే.. విద్యార్థులతో అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న ఆత్మీయ బంధం చాలా గొప్పదన్నారు. ఏయూ సెనేట్లో జీవితకాల సభ్యుడిగా ఆయనకు లభించిన గౌరవం, కళాప్రపూర్ణ వంటి అవార్డులు ఈ విశ్వవిద్యాలయం నుంచే అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఇక్కడి నుంచి వచ్చిన చాలా మంది చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. సీనీ ప్రముఖులు రావడంతో విశ్వవిద్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్ధులు సభకు హాజరై కేరింతలు కొట్టారు. దీంతో పాటు సభ ప్రారంభానికి ముందు సంగీత కళాకారులు సభను ఉత్సాహ పరిచారు.