Best Course For Students: ఏ కోర్సు ఎంచుకోవాలి అనే గందరగోళానికి చెక్ పెట్టండి ఇక..

By

Published : Jul 11, 2023, 7:40 PM IST

thumbnail

AICTE Officer Buddha Chandrasekhar Interview: ఇంజినీరింగ్‌లో ప్రవేశాలంటే కేవలం కంప్యూటరు సైన్స్‌ కోర్సుల కోసం పరుగులు తీస్తుండడం గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది.  ఒకప్పుడు బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సుల వైపు మొగ్గు చూపిన యువత.. గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్‌ సంబంధిత కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం ఆ కోర్సుల వైపే ప్రోత్సహిస్తున్నారు. 90 శాతం మంది పాలిటెక్నిక్‌ ఇతర డిప్లమో కోర్సు విద్యార్ధులు ఇంజినీరింగ్‌ వైపు వస్తున్నారు. సీఎస్‌ఈ ఒక్కటే ఇంజినీరింగ్‌ అన్నట్లుగా విపరీత ధోరణి పెరుగుతున్న వేళ.. ఇతర కోర్‌ గ్రూపులకు దారుణమైన నష్టం జరుగుతోంది.  అంతా కంప్యూటరు సైన్స్‌కు వెళ్తే ఇతర ఇంజినీరింగ్‌ అవసరాలు ఎలా అనేది అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న. సమస్తం కంప్యూటరు చుట్టే అయితే భవిష్యత్తు ఏమిటి? ఇటువంటి సమయంలో ఇతర కోర్సుల పరిస్థితి ఏంటి ? యువత భవితకు దారిచూపించే మంచి కోర్సులు ఏమిటి..? ఇతర కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఎంతవరకు ఉంటున్నాయి? తదితర అంశాలపై ఏఐసీటీఈ నేషనల్‌ చీఫ్‌ కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ బుద్దా చంద్రశేఖర్‌తో మా ప్రతినిధి శ్రీనివాస మోహన్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.