'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమానికి ఏర్పాట్లు - సీఎం పర్యటనతో అధికార యంత్రాంగం హడావుడి - లయోలా పబ్లిక్‌ స్కూల్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 5:41 PM IST

Adudham Andhra Program Arrangements: 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమ ప్రారంభం కోసం మంగళవారం సీఎం జగన్ గుంటూరు వస్తున్న సందర్భంగా అధికార యంత్రాంగం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోంది. సీఎం పర్యటించే మార్గాల్లో చెట్టు కొమ్మలను కొట్టేస్తున్నారు. నిర్వహణ లేక కళాహీనంగా తయారైన డివైడర్‌కు రంగులు అద్ది సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నల్లపాడు కూడలి నుంచి లయోలా పబ్లిక్‌ స్కూల్‌ వరకు రోడ్డుమీద గుంతలు కనిపించకుండా మరమ్మతులు చేస్తున్నారు. చుట్టుగుంట-నల్లపాడు ప్రధాన డ్రెయిన్‌ దుర్వాసన వెదజల్లుతోందని ఆ ప్రాంత ప్రజలు మొత్తుకుంటున్నా ఇన్నాళ్లూ నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సీఎం వస్తుండడంతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. 

Huge Arrangements for CM YS Jagan Guntur Tour: మంగళవారం సీఎం తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్​లో నేరుగా పాలిటెక్నిక్ హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అనంతరం అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న లయోలా పబ్లిక్‌ స్కూల్‌కు రోడ్డుమార్గంలో వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో దుకాణాలకు వెళ్లటానికి మార్గం లేకుండా పోయింది. ఇలా అయితే వ్యాపారం సాగదంటూ కొందరు దుకాణాలు మూసేశారు. బాస్కెట్ బాల్ కోర్టులు, ఇతర క్రీడా ప్రాంతాలన్నింటినీ వైఎస్సార్సీపీ రంగులతోనే నింపేయడం విమర్శలకు తావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.