Actor Prithvi Sensational Comments On Ambati: 'అంబటి రాంబాబు ఎవరో నాకు తెలీదు.. ఆయనేమన్నా ఆస్కార్ స్థాయి నటుడా..?' - Actor Prithvi on Dance Controversy
🎬 Watch Now: Feature Video
Actor Prithvi Sensational Comments on Minister Ambati Rambabu: ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్.. ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయనెవరో తనకు తెలియదన్నారు. బ్రో చిత్రంలో అంబటి రాంబాబును అనుకరిస్తూ డ్యాన్స్ చేయడానికి ఆయనేమన్నా ఆస్కార్ స్థాయి నటుడా అని ఎద్దేవా చేశారు. 'బ్రో' చిత్రంలో శ్యాంబాబు పాత్రలో పృథ్వీరాజ్ నటించి డ్యాన్స్ చేసిన సన్నివేశం.. ఆ సినిమా విడుదలైన రోజు నుంచి పొలిటికల్ వివాదంగా మారింది. శ్యాంబాబు పాత్రపై మంత్రి అంబటి అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై బ్రో చిత్ర సక్సెస్ మీట్లో స్పందించిన పృథ్వీరాజ్.. అంబటి రాంబాబు ఎవరో తనకు తెలియదన్నారు. ఆ పాత్ర చేయడం వల్ల తనకు ఎంతో పేరు వచ్చిందని,.. దర్శకుడు సముద్రఖని చెప్పిన పాత్రే తాను పోషించానన్నారు. అంతేకాకుండా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా.. చిత్ర పరిశ్రమ మళ్లీ తనను అక్కున చేర్చుకుందని, ఆశించిన స్థాయిలోనే పారితోషకాలు కూడా అందుతున్నాయన్నారు. ఇందుకు కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని పృథ్వీరాజ్ చెప్పడం విశేషం.