స్పెషల్ ట్రైన్లో పని చేయని ఏసీ - గూడూరు దగ్గర ప్రయాణికుల ఆందోళన - కేరళ విశాఖపట్నం ట్రైన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 9:10 PM IST
AC Not Working in Kerala-Visakhapatnam Special Train : కేరళ నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ ట్రైన్లోని కొన్ని భోగిల్లో ఏసీ పని చేయకపోవడం వల్ల గూడూరు వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఏసీ పని చేయకపోవడం వల్ల గాలి ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయగా రేణిగుంట వద్ద రిపేర్చేశారు. కానీ కొద్దిసేపు పని చేసి ఏసీలు మళ్లీ ఆగిపోయాయని ప్రయాణికులు పేర్కొన్నారు.
Passengers Protest at Guduru : ఏసీ తిరిగి పని చేయకపోవడంతో గూడూరు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి నిలిపి ఆందోళనకు దిగారు. రైల్వే సిబ్బందికి విషయం తెలపగా దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహించి గంటల తరబడి రైలును నిలిపివేశారు. రైలు ఆగిపోవడం వల్ల కొంత మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సరైన సౌకర్యాలు కల్పించకపోగా 'ఏసీ పని చేయకపోతే చచ్చిపోతారా' అని రైల్వే సిబ్బంది సమాధానమిచ్చారని ప్రయాణికులు వాపోయారు. దాదాపు మూడు గంటలు రైలును నిలిపి వేయడం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.