Crocodile Trapped in a Cage Set Up By Forest Official : బోనులో చిక్కిన మొసలి.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 4:55 PM IST

Crocodile Trapped in a Cage Set Up By Forest Official : అల్లూరి సీతరామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం కుందాడ గ్రామంలో  ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న మెుసలిని ఎట్టకేలకు అటవీ అధికారులు పట్టుకున్నారు. గత వారం రోజులుగా గ్రామంలోని చెరువులో ఉంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. గ్రామంలోని గిరిజనులకు చెందిన రెండు మేకలను మెుసలి తినేేసింది. చెరువులో మెసలి ఉండటం వల్ల స్థానికులు అటు వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు ఈ నెల 14న అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎఫ్ఓ నరేంద్రన్ ఆధ్వర్యంలో రేంజి అధికారి ఆజాద్ ప్రత్యేక బృందంతో మొసలిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోనులో మొసలి చిక్కింది. పట్టుకున్న మెుసలిని పాపికొండలోని నేషనల్ పార్క్‌కు చెందిన అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం విడిచిపెట్టారు. దీంతో గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.