A Car Stuck in Flood Water in Gadasingupuram : ఉద్ధృతంగా ప్రవహిస్తున్న రాళ్లగెడ్డ.. వరదలో చిక్కుకున్న కారు - ఏపీ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 4:05 PM IST

A Car Stuck in Flood Water in Gadasingupuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీగా కురిసిన వర్షానికి.. జియ్యమ్మవలస మండలంలోని గడసింగుపురం సమీపంలోని రాళ్లగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారిపైకి వరద నీరు ప్రవహిస్తోంది.  తీవ్రతను గమనించకుండా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ కారు వాగు దాటేందుకు ప్రత్నించింది. దీంతో కారు నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు కారులో ఉన్న వారిని రక్షించి.. బయటకు తీసుకొచ్చారు. స్థానికులే నీటిలో మునిగిపోయిన కారును క్రేన్​ సాయంతో బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  

వానలు కారణంగా వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారిపైకి వరద నీరు రావడం వల్ల అటు ప్రయాణికులు, ఇటు పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జియ్యమ్మవలస, డంగభద్ర, గడసింగుపురం మీదుగా వీరఘట్టం, పాలకొండకు వెళ్లే ప్రయాణికులు ఈ వరద ప్రవాహంలోనే ప్రయాణాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.