ETV Bharat / state

కానిస్టేబుల్​ వేధింపులు - పీహెచ్​డీ విద్యార్థిని బలవన్మరణం - PHD STUDENT SUICIDE

ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న తండ్రి - డబ్బులు తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్​ దంపతుల వేధింపులు - నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య

phd_student_suicide
phd_student_suicide (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 17 hours ago

PhD Student Suicide in Hyderabad : హైదరాబాద్ నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కానిస్టేబుల్‌ వేధింపులు భరించలేకనే బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని దీప్తిని వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అనిత భర్త అనిల్‌, మరో వ్యక్తి సైదులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

నాచారం పోలీసులు తెలిపిన వివరాలివీ:

నాచారంలోని బాపూజీనగర్‌ సరస్వతీకాలనీకి చెందిన పులివర్తి దీప్తి (28) హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పని చేస్తోంది. దీప్తి తండ్రి సంగీతరావు గతంలో అదే కంపెనీలో పని చేసి పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయం ఏర్పడగా అనిల్‌ భార్య అనితకు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు తీసుకున్నాడు.

రెండేళ్ల క్రితం డబ్బులు తీసుకున్నా ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగివ్వాలని అనిల్‌ దీప్తిని అడిగేవాడు. కాగా, డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని దీప్తి సమాధానం చెప్పినా అనిల్‌ పట్టించుకోకుండా తన భార్యతో నాచారం ఠాణాలో ఫిర్యాదు చేయించాడు. ఈ క్రమంలో దీప్తి, సంగీతరావుపై పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు.

పైగా కానిస్టేబుల్ అనిల్ ఆయన భార్య అనిత న్యాయస్థానంలో సివిల్‌ దావా కూడా వేశారు. కాగా, తనకు సంబంధం లేని విషయంలో కేసు పెట్టి కోర్టుకీడ్చారని మనస్తాపానికి గురైన దీప్తి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందగా ఆమె ఫోన్‌లో సూసైడ్ వీడియో (సెల్ఫీ) లభించింది. ఈ మేరకు పోలీసులు అనిత, అనిల్ తో పాటు సోమయ్యపై కేసు పెట్టారు

వీడియోలో ఏముందంటే!

తన మరణానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని దీప్తి సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేసింది. తన తండ్రి డబ్బు తీసుకుంటే తనపై కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారని, కేసుల మీద పోరాడే స్థోమత తనకు లేదని, తన మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని పేర్కొంది. తన ఆత్మహత్యకు కారణమైన వాళ్లకు శిక్షపడాలని, మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని చివరి కోరికగా వెల్లడించింది.

ప్రధానోపాధ్యాయుడిని బలిగొన్న స్నేహం - సూసైడ్‌ నోట్​లో దారుణ విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.