54 టన్నుల ట్రక్కు, బస్సును సింపుల్‌గా లాగేసిన బాహుబలి! - రష్యా హల్క్
🎬 Watch Now: Feature Video
రష్యా బాహుబలి సెర్గెయ్ అగడ్జాన్యాన్.. అరుదైన ఫీట్ సాధించారు. 53.6 టన్నుల బరువున్న కాన్వాయన్‌ను తాళ్లతో తన శరీరానికి కట్టుకొని (Towing Truck) ముందుకు లాగారు. 33 సెకన్లలో 80 సెంటీమీటర్ల మేర కాన్వాయ్‌ను లాగి (Towing Vehicle) సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. 'పవర్ ఎక్స్ట్రీమ్ రష్యా' బృందం ఈ రికార్డును నమోదు చేసుకుంది. 41 టన్నుల ట్రక్కు, 12 టన్నుల బస్సు ఈ కాన్వాయ్‌లో ఉన్నాయి. 53.6 టన్నులు అంటే.. ఎనిమిది మగ ఏనుగుల బరువుతో సమానం. కాన్వాయ్‌ను లాగడమే కాకుండా... ఆ సమయంలో 'హాట్ వాటర్ బాటిల్' పగిలేంత వరకు నోటితో గాలి ఊదారు. ఈ ఫీట్ సాధించేందుకు రెండేళ్ల నుంచి సన్నద్ధమవుతున్నారు సెర్గెయ్.