'విజ్ఞాన్'లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు - వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఘంగా సంక్రాంతి వేడుకలు
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో.. సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, కోలాటాలతో.. కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణ కనిపించింది. గోమాత పూజతో మొదలైన సంబరాలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థినీ, విద్యార్థులు మెరిసిపోయారు. సంక్రాంతి విశిష్టతను తెలిపేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు కనువిందు చేశాయి. సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య తెలిపారు.